అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్రవీణ్ (27) MS చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడ విస్కాన్సిన్ మిల్వాకీలో నివాసం ఉంటున్నాడు. అయితే అతడి ఇంటికి సమీపంలోని బీచ్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మరణించాడు. దీంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో కేశంపేట గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.