Home Page SliderNational

“అది కనిపిస్తే కాల్చేయండి”..ముఖ్యమంత్రి

ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లా తోడేలు దాడులతో భయాందోళనకు గురవుతోంది. గత కొన్ని నెలలుగా తోడేళ్లు పసి పిల్లలను దాడి చేసి చంపేస్తున్నాయి. అవి తరచూ స్థావరం మార్చడంతో వాటిని పట్టుకోవడం సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. దీనితో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోడేలు కనిపిస్తే కాల్చేయమంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ భేడియా పేరుతో విశ్వప్రయత్నాలు చేసి, 4 తోడేళ్లు పట్టుకున్నారు. అయినా తోడేళ్ల దాడులు ఆగలేదు. ఇప్పటి వరకూ తోడేళ్ల దాడిలో 10 మంది మరణించారు. వీరిలో 9 మంది చిన్నారులే. సోమవారం కూడా ఐదేళ్ల చిన్నారిపై దాడి చేశాయి తోడేళ్లు. దీనితో సీరియస్‌గా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతీ నాలుగైదు రోజులకొకసారి తోడేళ్లు మరో కొత్త గ్రామానికి చేరుకుని, అక్కడ దాడి చేస్తున్నాయి. డ్రోన్లతో తోడేళ్ల కదలికలు తెలుసుకుంటున్నామని, రాత్రివేళల్లో తలుపులు మూసివేసి ఇంట్లోనే నిద్రపోవాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. రకరకాల ఉచ్చుల ద్వారా తోడేళ్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. పిల్లల మూత్రంతో తడిపిన రంగురంగుల బొమ్మలకు చిన్నారుల దుస్తులు వేసి, గుహలు, నదీ ప్రాంతాలలో ఉంచుతున్నారు.