“పానీపూరీ” తింటున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త
“పానీపూరీ” ఇది కొందరికి ఓ ఎమోషన్. మన దేశంలో పానీపూరీకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. దీంతో నగరాల్లోని ప్రతిరోడ్డులో మనకు పానీపూరీ బండ్లు దర్శనమిస్తుంటాయి. ఇలాంటి క్రేజ్ ఉన్న పానీపూరీ గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కాగా ఫుడ్ సెఫ్టీ అధికారులు ఇటీవల స్ట్రీట్ ఫుడ్‌లపై దండయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు కర్ణాటకలోని పలు పానీపూరీ దుకాణాల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పానీపూరీ టేస్ట్,నీటి రంగు కోసం బ్రిలియంట్ బ్లూ,టార్ట్రాజైన్,సన్‌సెట్ ఎల్లో లాంటి రసాయనాలను విక్రయదారులు పానీపూరీలో కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ హానీకారక రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరీక్షల్లో తేలినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు తమిళనాడులో కూడా ఇలాంటి రసాయనాలనే వాడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో పానీపూరీ అమ్మకాలపై నిషేదం విధించాలని ప్రభుత్వాలు యోచిస్తున్నట్లు సమాచారం.