Home Page SliderInternational

ILO నివేదికలో నిరుద్యోగంపై నివ్వెరపోయే నిజాలు

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తన నివేదికలో నిరుద్యోగంపై నివ్వెరపోయే నిజాలు బయటపెట్టింది. గ్లోబల్ యూత్ అన్‌ఎంప్లాయిమెంట్ 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని ILO తెలిపింది. ఆసియా దేశాలలో ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని పేర్కొంది. గత సంవత్సరం 15 ఏళ్ల నుండి 25 ఏళ్ల మధ్య వయసు వారిలో 64.9 మిలియన్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారని గెట్ ఫర్ యూత్ నివేదికలో పేర్కొంది. అరబ్ దేశాలు, తూర్పు,ఆగ్నేయ ఆసియా దేశాలు, పసిఫిక్ ప్రాంతాలలో నిరుద్యోగ రేటు 13 శాతంగా ఉందని, వారిలో ఎక్కువ మంది చదువుకున్నవారే ఉన్నారని పేర్కొంది. చదువుకున్నవాళ్లకు హైస్కిల్ ఉద్యోగాలు లేవని, కానీ తయారీ రంగం, సేవల రంగాలలో మాత్రం ఉద్యోగాల కొరత వేధిస్తోందని తెలిపింది.