సింహాచలం గోడ కూలిన ఘటనలో విస్తుపోయే నిజాలు..
సింహాచలంలో గోడ కూలి 8 మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో కాంట్రాక్టర్ విస్తుపోయే నిజాలు చెప్పారు. కమిటీ ముందు ఆయన మాట్లాడుతూ.. ‘చందనోత్సవానికి సమయం తక్కువ ఉంది, నేను గోడ కట్టనని చెప్పాను. కానీ దేవస్థానం, టూరిజం అధికారులు గోడ కట్టమని నా మీద ఒత్తిడి చేశారు. ఆరు రోజుల సమయంలో గోడ నిర్మాణం సాధ్యం కాదని ముందే చెప్పాను.టెంపరరీ గోడ అని చెప్పడంతో నాలుగు రోజుల ముందు పని మొదలు పెట్టాను.’ అని కమిటీ ముందు కాంట్రాక్టర్ లక్ష్మణ రావు సంచలన నిజాలు చెప్పారు.