Breaking NewsHome Page SliderNationalNewsPoliticsviral

కాంగ్రెస్ పార్టీకి షాక్..

కాంగ్రెస్ పార్టీకి శశిథరూర్ తరహాలోనే మరో షాక్ తగిలింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సల్మాన్ ఖుర్షీద్ ఇండోనేషియాలో వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆపరేషన్ సిందూర్‌పై ఏర్పాటైన అఖిలపక్ష బృందంలో ఆయన పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, జపాన్, సింగపూర్, సౌత్ కొరియాలలో పర్యటిస్తున్న బృందంలో సల్మాన్ ఖుర్షీద్ సభ్యునిగా ఉన్నారు. ఉగ్రవాదంపై పాక్ విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ ప్రతినిధులు 30 దేశాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలకతీతంగా నరేంద్రమోదీ సర్కారుకు అనుకూల వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.