Home Page SliderPoliticsTelanganatelangana,

కేటీఆర్‌కు షాక్

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌లో ఉచ్చు బిగిస్తోంది ఏసీబీ. కేసు విచారణ సందర్భంగా ఏ1గా ఉన్న కేటీఆర్‌ను ఈ నెల 6వ ఉదయం విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. మరోపక్క ఇదే కేసులో ఈడీ కూడా దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్, మాజీ కమిషనర్ అర్వింద్ కుమార్‌లకు కూడా విచారణకు రావాలంటూ ఈడీ కోరగా, వారిద్దరూ సమయం కావాలన్నారు. ఈ నెల 7న మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈడీ విచారించనుంది.