Home Page SliderInternational

పాక్ క్రికెటర్ రిటైర్మెంట్‌కి కారణం తెలిస్తే షాక్

సాధారణంగా క్రికెటర్లు ఎవరైనా వయస్సు పైబడిందనో,ఫిట్‌నెస్ తగ్గిందనో క్రికెట్ నుంచి రిటైర్ అవుతూ ఉంటారు. అయితే పాక్ క్రికెటర్ అసద్ షఫిక్ మాత్రం ఇందుకు భిన్నంగా విచిత్రమైన కారణంతో రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఆ  కారణం ఏంటో తెలిస్తే అందరు షాక్ అవ్వాల్సిందే. అదేంటంటే తనకి క్రికెట్‌పై ఇష్టం తగ్గిందని పాక్ క్రికెటర్ అసద్ షఫిక్ అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌ నుండి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నాకు క్రికెట్‌పై మునుపు ఉన్నంత ఉత్సాహం ,ఇష్టం లేదు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్ కూడా లేదు. అందుకే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నా”నని షఫీక్ తెలిపారు. కాగా 37 ఏళ్ల షఫీక్ పాక్ తరుపున ఇప్పటివరకు 77 టెస్టులు,60 వన్డేలు,10 టీ20లకు ప్రాతినిధ్యం వహించినట్లు తెలుస్తోంది.