Andhra PradeshHome Page Slider

ఏలూరులో వైసీపీకి షాక్

ఏలూరులో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. నగర మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరి వైసీపీకి ఝలక్ ఇచ్చారు. వీరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ సహాయంతో మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేష్ వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు వంటి పలువురు నేతలు కూడా వైసీపీని వీడి, టీడీపీ బాట పట్టారు. ఏలూరు అభివృద్ధి కోసం వచ్చేవారిని స్నేహ హస్తం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. దాదాపు 40 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మేయర్ షేక్ నూర్జహాన్ పేర్కొన్నారు. గతంలో విధిలేని పరిస్థితులలో టీడీపీని విడిచి వైసీపీకి వెళ్లామని, మళ్లీ తిరిగి టీడీపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.