ట్రంప్ కు షాక్…మహిళను వరించిన నోబెల్ శాంతి బహుమతి
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 కోసం వెంపర్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. మానవత్వానికే పెద్ద పీట వేస్తూ నోబెల్ కమిటీ మరియా కొరీనా మచాడోకు ఈ బహుమతిని ప్రకటించింది. వెనెజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. మాచడోను వెనెజూలాలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో, అధికారుల ప్రతికూల విధానాలను ఎదిరించి పోరాడిన నాయకురాలిగా గుర్తించింది నార్వే నోబెల్ కమిటీ. ఆమెకు డిసెంబర్ 10 న నార్వేలో ఈ బహుమతిని ప్రదానం చేయనున్నారు. ఈ బహుమతిని ఆమెకు ప్రకటించడం ద్వారా నోబెల్ తన నిష్పక్షపాత వైఖరిని నిరూపించుకుందని ప్రముఖులు కొనియాడారు. హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతోన్న జపాన్ కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు గతేడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కిన విషయం తెలిసిందే.