విడుదలైన రోజే “శాకుంతలం” మూవీకి షాక్
గుణశేఖర్ దర్శకత్వంలో హీరోయిన్ సమంత నటించిన చిత్రం “శాకుంతలం” కు విడుదల రోజే గండి పడింది. కాగా ఈ రోజు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమ్యాక్స్ థియేటర్‌కు వెళ్లే దారులన్నీ ఈ రోజు రాత్రి 8 గంటల వరకు పోలీసులు మూసివేశారు. దీనివల్ల ఈ రోజు ఐమ్యాక్స్ థియేటర్‌లో సాయంత్రం 6 గంటల వరకు ఉన్న షోలన్నీ రద్దయ్యాయి. అయితే ఇప్పటికే టికెట్స్ బుక్ చెసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని ఐమ్సాక్స్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విధంగా ఈ రోజు సమంత “శాకుంతలం” సినిమాకు బ్రేక్ పడింది.


 
							 
							