తెలంగాణ ఇంటర్ కాలేజీలకు షాక్
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ కాలేజిలకు షాక్ ఇచ్చింది. సరైన గుర్తింపు లేని ఇంటర్మీడియట్ కాలేజిల విద్యార్థుల నుండి పరీక్ష ఫీజును స్వీకరించలేదు. దీనితో దాదాపు 300కి పైగా ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఫీజులు వసూలు చేస్తున్నాయి కాలేజీలు. ప్రభుత్వ గుర్తింపు లేకపోతే ఆ కాలేజీలను రద్దు చేస్తామని ప్రభుత్వం ముందుగానే హెచ్చరించింది.