Home Page SliderNational

రైల్వే ప్రయాణికులకు షాక్.. టికెట్ అడ్వాన్స్ బుకింగ్ లో మార్పులు

ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ లో భారతీయ రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇప్పటిదాకా ట్రైన్ షెడ్యూల్ డేటు 120 రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉండేది. ఇకపై.. 60 రోజుల ముందు నుంచి మాత్రమే ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్ నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. అయితే.. ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు ఈ నిబంధన వర్తించదు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.