పాక్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు షాక్..
పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఫిఫా) షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించడంలో విఫలమయ్యిందని పేర్కొంటూ సస్పెండ్ చేసింది. పాక్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో ఎన్నికల నిర్వహణకు, గ్రూపిజాన్ని నిర్మూలించడానికి నార్మలైజేషన్ కమిటీని 2019లో ఫిఫా ఏర్పాటు చేసింది. కానీ దీనితో అనుకున్న ఫలితాలు రాలేదు. దీనితో ఈ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2017 నుండి ఇలా సస్పెన్షన్‌కు గురి కావడం మూడోసారి కావడం విశేషం.