Home Page SliderTelangana

కేటీఆర్‌కు షాక్

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు తీవ్ర నిరసన ఎదురయ్యింది. ప్రొఫెసర్ సాయిబాబా భౌతికదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు సాయిబాబా అభిమానులు షాక్ ఇచ్చారు. విప్లవం వర్థిల్లాలి, కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో బలమైన పాత్ర వహించిన ప్రొఫెసర్ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ తొమ్మిదేళ్లపాటు మహారాష్ట్ర జైలులో శిక్ష విధించారు. ఇటీవలే విడుదలైన ఆయన ఇంతలోనే అనారోగ్యంతో కన్నుమూయడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయనను విడిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదంటూ నిరసనలు చేస్తున్నారు అభిమానులు. దీనితో కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.