మందుబాబులకు షాక్
హైదరాబాద్ పరిధిలోని మందుబాబులకు చేదు వార్త. రేపు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఈ నెల 6న వైన్ షాపులు బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా నగర పరిధిలోని వైన్ షాపులతో పాటు కల్లు కాపౌండ్లు, బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు కూడా క్లోజ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

