Home Page SliderNationalPolitics

ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు షాక్

ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇండియా కూటమిలో భాగమైన సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మద్దతుపై కేజ్రీవాల్ అఖిలేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమకోసం అఖిలేష్ యాదవ్ ఎప్పుడూ నిలబడతారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆప్ నేత కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కాకుండా వేరువేరుగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. దీనితో ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థిగా నిలవబోదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధాన పోటీ బీజేపీ, ఆప్‌ల మధ్యే ఉంటుందని పేర్కొంటున్నారు.