Home Page SliderNational

అరంగేట్రంలోనే శివతాండవం, శ్రీలంకకు చక్కులు చూపించిన మావి

మంగళవారం ముంబైలో జరిగిన మొదటి T20Iలో శ్రీలంకపై భారత్ రెండు పరుగుల స్వల్ప విజయాన్ని సాధించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శివమ్ మావి కనికరంలేని ఫాస్ట్ బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంకపై భారత్ విజయాన్ని నమోదు చేసింది. దీపక్ హుడా (41), అక్షర్ పటేల్ (31) ఆతిథ్య జట్టును 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా… శ్రీలంక స్పిన్నర్లను భారత్ బ్యాటింగ్‌లు దెబ్బతీశారు. 163 పరుగులను ఛేదించడానికి శ్రీలంక ఆటగాళ్లు ఒకానొక సమయంలో తడబడ్డా.. విజయం దిశగా ఆట కొనసాగించారు. ఇన్నింగ్స్ ముందు, వెనుక చివరలో మావి చేసిన స్ట్రైక్‌లతో టీమ్ ఇండియా గట్టెక్కింది.

ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్ అక్షర్ పటేల్ 13 పరుగులను డిఫెండ్ చేయడంతో శ్రీలంక మ్యాచ్ రసవత్తరంగా మారింది. మావి నాలుగు ఓవర్లలో 22 పరుగులకు నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. కెప్టెన్ దసున్ షనక (27 బంతుల్లో 45), చమిక కరుణరత్నే (16 బంతుల్లో 23 నాటౌట్) చేసిన పోరాటం ఫలించకపోవడంతో శ్రీలంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు భారత్ డిఫెండ్ చేసిన అత్యల్ప టోటల్ ఇదే. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరో ఎండ్‌లో అరంగేట్ర ఆటగాడు మావి బలమైన బౌలింగ్ శ్రీలంకను కట్టడి చేసింది. భారత జట్టులో చోటు కోసం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాననంటూ చెప్పుకొచ్చాడు శివమ్ మావి.

2018 అండర్-19 ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున ఆడినప్పుడు శివమ్ మావి మొదట అందరి దృష్టిని ఆకర్షించాడు. గొప్ప పేస్‌తో బౌలింగ్ చేస్తూ, అతను కమలేష్ నాగర్‌కోటితో కలిసి పేస్‌లో దుమ్మురేపాడు. అదే సంవత్సరంలో, IPL కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ అతనిని కొనుగోలు చేసింది. అయితే, గాయాలు అతని కెరీర్‌ను దెబ్బతీయడంతో ముందుకు వెళ్లలేకపోయాడు. సుదీర్ఘ కాలం వేచి ఉన్నాక… జట్టులో తిరిగి చేరాడు. IPL 2023 వేలంలో, మావిని గుజరాత్ టైటాన్స్ 6 కోట్ల రూపాయలకు తీసుకుంది. 163 విజయ లక్ష్యంతో శ్రీలంకను 160 పరుగులకే ఆలౌట్ చేయడంతో పాటు ముంబైలో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

బరీందర్ స్రాన్ (4/10 vs జింబాబ్వే, హరారే 2016), ప్రజ్ఞాన్ ఓజా (4/21 vs బంగ్లాదేశ్, నాటింగ్‌హామ్ 2009) తర్వాత T20I లలో భారత అరంగేట్రం చేసిన మూడవ అత్యుత్తమ గణాంకాలు ఇవి. అండర్ 19 ఆడిన తర్వాత ఆరేళ్లుగా జట్టులో వచ్చేందుకు చూస్తున్నానని… గాయాలు కూడా దెబ్బతీశాయని శివమ్ మావి చెప్పాడు. ఐపీఎల్‌లో పాల్గొంటున్నందున టెన్షన్ కూడా తగ్గిందన్నాడు. పవర్‌ప్లేలో నా టాప్ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపించడమే లక్ష్యంగా బౌలింగ్ చేశానన్నాడు. 24 ఏళ్ల మావికి సహచర పేస్ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంక విజయానికి 12 పరుగులు కావాల్సిన చివరి ఓవర్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ చక్కగా బౌలింగ్ చేయడంతో ఇండియా విజయం సొంతం చేసుకొంది.