Home Page SliderNational

శివసేన (UBT) మేనిఫెస్టో రిలీజ్.. మగ పిల్లలకు ఉచిత విద్య..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను శివసేన (యూబీటీ) తన మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది. ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే విద్యార్థినులకు ఉచిత విద్య అందుతున్నట్టే బాలురకు సైతం ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసర ధరలను నియంత్రిస్తామని, ధారావి రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును రద్దు చేస్తామని పేర్కొంది. పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని హౌసింగ్ పాలసీ తీసుకొస్తామని వెల్లడించింది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో అందుబాటు ధరలో ఇళ్లు నిర్మిస్తామని తెలిపింది.