ఐపిఎల్ మెగా వేలంలో ఓడలు-బండ్లు
ఐపిఎల్ మెగా వేలంలో బండ్లు ఓడలు…ఓడలు బండ్లు అవుతున్నాయి. ఆర్సీబి… విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు రిటైన్‌చేసుకుంది .చెన్నై సూపర్ కింగ్స్.. ధోనిని రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది . ముంబై తరుఫున రోహిత్ శర్మ రూ.18.3 కోట్లకు రిటైన్ అయ్యాడు.ముంబై ఇండియన్స్… హార్దిక్‌పాండ్యను రూ.16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది. అదేవిధంగా బుమ్రాను రూ.18 కోట్లకు ముంబై తరుఫున రిటైన్ అయ్యాడు. రింకు సింగ్‌ను కోల్ కతా రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఢిల్లీ కేపిటల్స్.. కుల్‌దీప్‌ను రూ.13.25 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది . అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్ దక్కించుకుంది. ధృవ్ జురేల్‌ను రూ.14 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకుంది . రియాన్ పరాగ్‌ను రూ.14 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. మయాంక్ యాదవ్ ను లక్నో రూ.11 కోట్లకు దక్కించుకుంది. జైస్వాల్ రూ.18 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకుంది. శుభ్‌మన్ గిల్ రూ.16.5 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. విదేశీ ఆటగాడు…రషీద్ ఖాన్ అత్యధికంగా తన కెరీర్ లోనే రూ.18 కోట్లకు గుజరాత్ కు సొంతం అయ్యాడు.చెన్నై సూపర్ కింగ్స్ .. శ్రీలంక ఫేసర్ పతిరణను రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుంది.ముంబై.. తిలక్‌వర్మను రూ.8 కోట్లకు దక్కించుకుంది. అభిషేక్ శర్మను రూ.14 కోట్లకు హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌ను రూ.16.35 కోట్లకు ముంబై తరుఫున సొంతం అయ్యాడు.స్టార్ బ్యాట్స్‌మెన్ KL రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను సొంతం చేసుకుంది. ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. రూ.8.75 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను దక్కించుకుంది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ. 18 కోట్లకు దక్కించుకుంది. ఎస్ఆర్‌హెచ్‌లోకి కీలక బౌలర్.. మహ్మద్ షమీని హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ. 10 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది.డెవాన్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐడెన్ మార్క్రమ్‌ను బేస్ ప్రైస్ రూ.2 కోట్లకే లక్నో సొంతం చేసుకుంది. దేవ్‌దత్ పడిక్కల్ అన్ సోల్డ్‌గా నిలిచాడు. బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకు ఎవరు కొనుగోలు చేయలేదు. హ్యారీ బ్రూక్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్. హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.


 
							 
							