షిండే డిప్యూటీ సీఎంగా చేయరు..కానీ క్యాబినేట్‌లో ఉంటారు
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగురోజులవుతున్నా ఇంకా ముఖ్యమంత్రిని నిర్ణయించలేదు. అయితే బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ నుండి ముఖ్యమంత్రిగా పనిచేసిన షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదని శివసేన ఎమ్మెల్యే షిర్సత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ రాష్ట్ర క్యాబినెట్‌లో ఉంటారని పేర్కొన్నారు. శివసేన పార్టీ నుండి మరొక వ్యక్తిని డిప్యూటీ సీఎంగా నామినేట్ చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్దర్మ సీఎంగా కొనసాగుతున్నారు. నేడు ఢిల్లీకి చేరనున్న మహాయుతి నేతల చర్చలలో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని సమాచారం.