National

తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టిన శిల్పా శెట్టి….!

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గణేషుడి నిమజ్జనం చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో భాగంగా బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకుంది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి నిమజ్ఞన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన ముద్దుల తనయ సమీషాతో కలిసి డ్యాన్స్ చేసింది శిల్పాశెట్టి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. కుటుంబం తో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందిని చెప్పింది. వచ్చే వియక చవితికి మీ అందరిని కూడా పిలుస్తానంటూ ట్వీట్ చేసింది. ఆ డాన్స్ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. లవ్లీ ఫామిలీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.