క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
స్టార్ బ్యాట్సమెన్ శిఖర్ ధావన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఆయన తప్పుకున్నాడు. 13 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టాడు. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసిన ధావన్… డిసెంబర్ 2022లో చివరిసారిగా టీం ఇండియాలో కనిపించాడు. ఆయన 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 6,793 టెస్టుల్లో 2,315 పరుగులు చేశారు. టీ20 మ్యాచ్ ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచరీలు ధావన్ ఖాతాలో ఉన్నాయి.