విషాదంలో శేఖర్ మాస్టర్ కుటుంబం
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. శేఖర్ మాస్టర్ సోదరుడు సుధా కన్నుమూశాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. నువ్వు ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటావని.. నువ్వెప్పుడూ మాతోనే ఉంటావని ఆశిస్తున్నాం. మిస్ యూ రా తమ్ముడు.. అంటూ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు శేఖర్ మాస్టర్.
నిన్ను మిస్ అవుతున్నాం సుధా.. నేనెక్కడికి వెళ్లినా.. ఏం చేసినా నువ్వే గుర్తొస్తున్నావ్.. సుధా మృతి పట్ల నటి, యాంకర్ అనసూయతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. శేఖర్ మాస్టర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శేఖర్ మాస్టర్ వదిన చనిపోయారు. తక్కువ సమయంలో ఇద్దరు కుటుంబసభ్యులు దూరమవడంతో కన్నీరుమున్నీరవుతున్న శేఖర్ మాస్టర్ కుటుంబం.