షేక్ హసీనా ఇక ఏ దేశం వెళ్లలేదా ?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెకు ఇచ్చిన దౌత్య పాస్‌పోర్టును రద్దు చేసింది. ఆమెకే కాకుండా హసీనా ప్రభుత్వ హయాంలో ఎంపీలకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లాదేశ్ హోం శాఖ ప్రకటించింది. ఈ పాస్‌పోర్టు లేకపోవడంతో ఆమె కొన్ని దేశాలకు వెళ్లలేకపోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఉంటే కొన్ని నిర్దిష్ట దేశాలకు వెళ్లవచ్చు.