Home Page SliderNational

సవతి కుమారుణ్ణి చంపి.. ట్యాంకులో దాచింది

గాజియాబాద్‌: సవతి కుమారుడంటే ఇష్టం లేని ఓ మహిళ అతణ్ణి చంపి మృతదేహాన్ని మురుగు ట్యాంకులో దాచిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ సేన్ అనే వ్యక్తి తన భార్యతో విడిపోయాక రేఖ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. తొలి భార్య సంతానమైన 11 ఏళ్ల కుమారుడు షాదాబ్ వారివద్దే నివసిస్తున్నాడు. ఈ నెల 15న షాబాద్‌ కనిపించకుండా పోయాడు. అతణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు రేఖ భర్తను నమ్మించింది. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటి సమీపంలోని సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించారు. అయితే షాబాద్ ఇంటి నుండి బయటకు వెళ్లినట్లు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బాలుడి కుటుంబ సభ్యులను విచారించారు. ఈ క్రమంలో రేఖ తన నేరాన్ని అంగీకరించింది. తన స్నేహితురాలితో కలిసి బాలుణ్ణి హతమార్చి మృతదేహాన్ని మురుగు ట్యాంకులో పడేసినట్లు తెలిపింది.