Home Page SliderNational

అంబానీని దాటి ఈ సంవత్సరపు అత్యధిక ఆర్జన ఆమెదే

2023వ సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఇంటర్నెట్ సర్వే జరిగింది. దీనిలో  దేశంలో ఈ సంవత్సరంలో అత్యధిక సంపదను ఆర్జించిన వారి వివరాలు వెల్లడయ్యాయి. ఆశ్చర్యకరంగా అంబానీ పేరో, అదానీ పేరో వినిపించకుండా ఒక మహిళ వీరిద్దరి కంటే ఎక్కువ సంపాదించినట్లు తెలిసింది. ఆమె సావిత్రి జిందాల్. జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకులు ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం జిందాల్ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్లూ స్టీల్, జేఎస్‌డబ్లూ పవర్, ఎనర్జీ, స్టెయిన్ లెస్ వంటి కంపెనీలు నడుస్తున్నాయి. ఈ ఏడాది ఈ కంపెనీల షేర్లు దేశీయమార్కెట్లో విపరీతంగా పెరిగాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆమె సంపద 9.6 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. మొత్తం సంపద 25.3 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. దేశంలోనే ఈ ఏడాది అధిక ఆర్జన ఆమెదే అయ్యింది. దేశంలోని సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచినా, మహిళలలో ఆమె మొదటి స్థానాన్ని సాధించారు.