Home Page SliderNational

ప్రధానిపై శశిథరూర్ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మోదీ జరిపిన చర్చలు భారత్ కు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడితో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మన ప్రధాని హుందాగా నడుచుకున్నారని ప్రశంసించారు. దేశం ఎదురు చూస్తున్న పలు సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని శశిథరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంపై అమెరికా టారిఫ్ లు విధిస్తుండటంపై కూడా శశిథరూర్ స్పందించారు. అమెరికా అధిక టారిఫ్ విధిస్తోందని, మనం తొందరపాటు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం దేశం నుండి ఎగుమతి అయ్యే ఇతర ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని అన్నారు.