Telangana

మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి షర్మిల సపోర్ట్

మునుగోడు ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలతో ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉత్కంఠగా మారుతోంది. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అలాగే అందివచ్చిన అవకాశాలని వదులుకోకుండా..ప్రత్యర్ధులకు చెక్ పెట్టే దిశగా పనిచేస్తున్నాయి. ఇక కులాల పరంగా ఓట్లు కొనుగోలు కార్యక్రమం జరుగుతుంది. ఇదే క్రమంలో మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. షర్మిల పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని తెలిసింది. తెలంగాణలో షర్మిల పార్టీ నల్గొండ , ఖమ్మం జిల్లాల్లో కాస్త ప్రభావం ఉంటుందని తెలిసిందే. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో రెడ్డి కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీలో ఓట్లు బాగానే ఉన్నాయి. అలాగే వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. వీరి ఓట్లు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి పడేలా షర్మిల పార్టీ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. మొదటి నుంచి కోమటిరెడ్డి కుటుంబం..వైఎస్సార్‌కు కుటుంబానికి విధేయతతోనే ఉన్నారు. షర్మిల పట్ల అభిమానం కూడా ఉంది. ఆ మధ్య షర్మిల మునుగోడులో ఓ దీక్ష చేస్తే రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి మరీ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఈ ఉపఎన్నికలో బరిలో నిలవకుండా షర్మిల..కోమటిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని సమాచారం