నాన్న కన్న ప్రతి కలను నెరవేరుస్తానంటున్న షర్మిల
ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖులు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు ఆయన చేసిన మంచి పనులను స్మరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కూడా నాన్నని గుర్తు చేసుకున్నారు. కాగా ఈ రోజు వైఎస్ జయంతి సందర్భంగా ఆమె ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. “నాన్న ఈ లోకాన్ని వదిలి వెళ్లినా..ప్రతి పేదవాడి చిరునవ్వులో ఎప్పుడూ బ్రతికే ఉంటారు. రైతులు ఆడబిడ్డల అభ్యున్నతి కోసం నాన్న కన్న ప్రతి కల..నేను నెరవేరుస్తా” అని సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు.

