Home Page SliderNational

ఎన్నికల వేళ షిండేతో శరద్ పవార్ భేటీ

మహారాష్ట్రలో కీలక దృశ్యం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో ఎన్పీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ భేటీ అయ్యారు. షిండే శివసేన పార్టీని చీల్చి, ఎన్డీయే కూటమితో కలిసి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఇక శరద్ పవార్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్భంలో అధికార, విపక్ష కూటములకు చెందిన వీరిద్దరూ ఎందుకు సమావేశమయ్యారనే ప్రశ్న ఆసక్తి కలిగిస్తోంది. వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించనున్నారని రాజకీయ విశ్లేషకులు సమీక్షిస్తున్నారు.