Andhra PradeshHome Page Slider

పోలవరానికి పట్టిన శని సీఎం జగనే:చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీలో గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని ముంపు ప్రాంతాలు నీటమునిగాయి. దీనిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్టును గురించి ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ..ఏపీలో పోలవరానికి సీఎం జగనే శని అని అన్నారు. ఈ శని పోతే తప్ప పోలవరం కల సాకారం కాదని చంద్రబాబు తెలిపారు. కాగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లందించవచ్చన్నారు. టీడీపీ హయాంలో పునరావాసానికి రూ.4,114 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అయితే వైసీపీ నిర్వాసితుల కోసం రూ.1,890కోట్లే ఖర్చు చేసిందన్నారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులకు ఎకరాకు రూ.19 లక్షలల ఇస్తామన్న హామీని కూడా మరిచిందన్నారు. సీఎం జగన్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోగా లబ్ధిదారుల జాబితాను మార్చి మోసం చేశారు అని చంద్రబాబు ఆరోపించారు.