వారికి అవమానం..కాళ్లమీద పడ్డ కలెక్టర్
చిత్తూరు జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు దళితులకు ఆహ్వానం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమాలకు ఆటంకం కలిగించారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు తమను నిర్లక్ష్యం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన కింది స్థాయి ఉద్యోగులు చేసిన తప్పని, దానిని క్షమించమంటూ వారిని కోరారు. వారు అంగీకరించకపోవడంతో తప్పక చర్యలు తీసుకుంటామంటూ మాటిచ్చి, వారి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరడంతో వారు శాంతించారు.