ఏపీ మహిళలకు శక్తి యాప్..
ఏపీ మహిళలకు పని ప్రదేశాలలో రక్షణ కల్పించే ఉద్దేశంతో కొత్తగా శక్తి యాప్‌ను తీసుకువస్తున్నామని హోం శాఖ మంత్రి అనిత పేర్కొన్నారు. ఈ యాప్‌ను మహిళా దినోత్సవం నాడు సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారని పేర్కొన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు ఉంటే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో దిశా చట్టానికి చట్టబద్దత లేదని ఆమె శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అందుకే దిశ చట్టాన్ని రద్దు చేసి, శక్తి యాప్‌ను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.

