సర్జరీ కోసం అమెరికాకు పయనమౌతున్న షారుఖ్ ఖాన్
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఓ సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. గతకొద్ది రోజులుగా తన కంటికి సంబంధించిన సమస్యతో షారుఖ్ ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యులు ఆయనను కంటి ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. 2014లో షారుఖ్ కంటి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్లీ కంటి సమస్య తలెత్తడంతో ఆయన ముంబైలోని వైద్యులను సంప్రదించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేయించుకోవాలని వారు సూచించడంతో, నేడు షారుఖ్ అమెరికా వెళ్తున్నట్లు బీ-టౌన్‌లో వార్తలు… కాగా, షారుఖ్‌తో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా అమెరికా వెళ్లనున్నారట. మరో మూడు రోజుల్లో షారుఖ్‌కు కంటి ఆపరేషన్ జరిగే అవకాశం ఉందట. షారుఖ్ సర్జరీ గురించి తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

