ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన షారుఖ్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటారు. అయితే బాలీవుడ్ బాద్‌షాగా పేరుగాంచిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బాద్‌షా అనే పేరును దక్కించుకున్నారు. టైమ్ మ్యాగజీన్ 2022కు గాను ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీలురను ఎంపిక చేసేందుకు పాఠకుల ఓటింగ్ నిర్వహించింది. అయితే ఈ ఓటింగ్‌లో ప్రముఖలను పక్కకు నెట్టి మరి బాలీవుడ్ బాద్‌షా అగ్రస్థానంలో నిలిచారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ , బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మెర్కెల్, మెటా సీఈఓ జుకర్‌బెర్గ్ వంటి ప్రముఖుల కంటే షారుఖ్ ఖాన్ ఎక్కువ ఓటింగ్ సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొనగా షారుఖ్ ఖాన్‌కు 4% ఓట్లు వచ్చాయి. షారుఖ్ తర్వాత స్థానాన్ని ఇరాన్‌లో ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలు దక్కించుకున్నారు. ప్రిన్స్ హ్యారీ,ఆయన భార్య వరుసగా 3,4 స్థానాలను దక్కించుకున్నారు.కాగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ 5వ స్థానంలో నిలిచారు.

