అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వైట్‌హౌస్ వీడియో రిలీజ్..
అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్ తో సహా ఇతర దేశాల్లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఇప్పటివరకు భారత్ కు పంపించిన వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి అవమానకర రీతిలో తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్ హౌస్ తాజాగా ఓ వివాదాస్పద 41 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించే ముందు వారికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

