Home Page SliderNational

పిల్లలు లేని జీవితం అసంపూర్ణమే అంటున్న షబానా అజ్మీ

షబానా అజ్మీ ఇటీవలే తనకు పిల్లలు లేరన్న విషయాన్ని బయటపెట్టింది. ఈ రోజు తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న నటి, ఈ వాస్తవాన్ని అంగీకరించడంలో ఆమె ఎన్నో ఎదుర్కొన్న సవాళ్లను, సామాజిక ఒత్తిళ్లు ఆమెను ఎలా అసంపూర్ణంగా భావించేలా చేశాయో చర్చించారు. షబానా అజ్మీ పిల్లలు లేని తన కష్టాలను పంచుకున్నారు. సామాజిక ఒత్తిళ్లు తనను అసంపూర్ణంగా భావించేలా చేశాయని ఆమె అన్నారు. షబానా జావేద్ అక్తర్‌ను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ నటి షబానా అజ్మీ ఇటీవల తన భర్త జావేద్ అక్తర్‌తో పెళ్లయ్యాక పిల్లలు లేకపోవడంతో చాలా బాధగా అనిపించిందని చెప్పింది. సెప్టెంబర్ 18న తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖ నటి, సామాజిక ఒత్తిళ్లు, తనను ఇరుగు, పొరుగు అనే సూటిపోటీ మాటలు ఎలా ఉండేవో షేర్ చేశారు. ఈ భావాలకు తన స్పందనను వివరించారు.

ఒక ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ, జావేద్ అక్తర్‌తో దాదాపు 40 ఏళ్ల క్రితం పెళ్లి అయిందని చెబుతూ తన మనసులోని మాటలను షబానా అజ్మీ షేర్ చేశారు. మీకు పిల్లలు లేకపోవడంతో ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో మీ ఫ్యామిలీకి, చుట్టాలకు చాలా కష్టమనిపిస్తుంది. దాంతో మీ బంధుత్వాలు కూడా చాలా తక్కువైపోతాయి. చుట్టరికాలు, రాకపోకలు తగ్గిపోతాయి. ఆ విషయాల గురించి మీరు బయటకు చెప్పుకోలేక చాలా బాధపడాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో భార్యగా, తల్లిగా, కుమార్తెగా ఎలా నిలదొక్కుకుంటారన్నది ఇక్కడ ఉండే సమస్య. ఒక వ్యక్తి విజయానికి పిల్లలు లేకపోవడం ప్రమాణం కాదు – బదులుగా, అతని కెరీర్, అతని పని, గొప్పదనానికి ఇదేమి అంత కష్టమనిపించదు. సంతృప్తి అనేది స్త్రీ, పురుషులకు సంబంధించిన విషయమని నేను నమ్ముతున్నాను. షబానా ఇలా చెబుతూ ఈ టాపిక్‌ను ఇంతటితో ముగిద్దామన్నారు.  ఒక ఇంటర్వ్యూలో, షబానా జావేద్ అక్తర్‌తో తన పెళ్లి గురించి కూడా ప్రస్తావించింది. రిలేషన్‌షిప్‌లో చెప్పుకోలేని ఒక విషయం గురించి అడిగినప్పుడు, షబానా ఇలా మాట్లాడారు, “గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుంటేనే వస్తుంది! మీరు గౌరవాన్ని ఎవరినైనా అడిగో, డిమాండ్ చేస్తూ తీసుకోలేరు, మీరు దానిని మీకై మీరు సంపాదించుకోవాలి తప్ప ఎవరూ ఇచ్చేది కాదు. పెళ్లి అంటే ఫస్ట్ కనిపించేది శృంగారపు ఆలోచన. కానీ మీరు కాపురం చేస్తూనే ఉండాలి – ఇది సఖ్యత, స్నేహం, ఒకరిపై ఒకరికి ఆసక్తి, మీ భాగస్వామికి మీ మనసులో చోటు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైంది.

షబానా, జావేద్ డిసెంబర్ 1984లో వివాహం చేసుకున్నారు. సినిమాలకు ముందు, షబానా లాస్ట్ టైమ్ కరణ్ జోహార్- రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీలో యాక్ట్ చేశారు.