ట్రంప్‌పై మరోసారి లైంగిక ఆరోపణలు
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ ప్రచార బృందానికి ట్రంప్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయంపై కీలక అప్‌డేట్ అందింది. స్టాసీ విలియమ్స్ అనే అమెరికా మాజీ మోడల్ తనను ట్రంప్ గతంలో అసభ్యంగా తాకాడంటూ లైంగిక ఆరోపణలు చేసింది. ఆమె 1992లో ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో డేటింగ్‌లో ఉందని, అప్పట్లో జెఫ్రీ ఫ్రెండ్ అయిన ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఫోన్ కాల్ ద్వారా కమలా హారిస్ బృందానికి తెలియజేసింది. అయితే ఈ విషయాలను ట్రంప్ ప్రచార బృందం కట్టుకథగా కొట్టిపారేసింది. అయితే గతంలో కొంతమంది స్త్రీలతో ట్రంప్ అనైతికంగా ప్రవర్తించినట్లు కోర్టు కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఆయనకు న్యూయార్క్ కోర్టు 5 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది.