Home Page Slidertelangana,

“ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలు”..రేవంత్ రెడ్డి

తెలంగాణలోని ప్రభుత్వ టీచర్లు, ఇతర సిబ్బంది పాఠశాలలో చదివే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్కూళ్లలో, హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని, వారికి మంచి పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో తేడాలు వస్తే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించామని, డైట్ ఛార్జీలు కూడా పెంచామని పేర్కొన్నారు. ప్రభుత్వం అప్రతిష్టపాలయ్యే పనులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పిల్లలు అస్వస్థులైన సంగతి తెలిసిందే. ఒకే వారంలో మూడు సంఘటనలు జరగడంతో హైకోర్టు కూడా తీవ్రంగా మందలించింది.