Home Page SliderNational

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌పై భారీగా వరద నీరు నిలిచిపోయింది. అంతేకాక హసన్ పర్తి- కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్‌పై వరద నీరు ముంచెత్తుతోంది. దీనితో ట్రాక్‌ను గమనించి రైళ్లను నడపడం కుదరని పని. అందుకే ఈ మార్గంలో ప్రయాణికుల రక్షణార్థం రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 9 రైళ్లను దారి మళ్లించారు. సిర్ఫూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేశారు. తిరుపతి- కరీంనగర్, సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేశారు.

రద్దయిన రైళ్లు

పాక్షికంగా రద్దయిన రైళ్లు—

దారి మళ్లించిన రైళ్లు–