నితీష్ బీజేపీ ఝలక్… 6గురు ఎమ్మెల్యేలు ఫిరాయింపు
మణిపూర్‌లోని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు అధికార బిజెపిలో చేరారు. దీనికి సంబంధించి మణిపూర్ అసెంబ్లీ ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీలో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ అంగీకరించారని మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి కె.మేఘజిత్ సింగ్ ప్రకటనలో తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఉన్నందున, వారు పార్టీ ఫిరాయింపుల కిందకు రారని అధికారులు పేర్కొన్నారు.

ఈశాన్యరాష్ట్రాల్లో మణిపూర్‌లో జేడీయూ పార్టీ శాసనసభ్యులను బీజేపీ టార్గెట్ చేయడం ఇది రెండోసారి. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏడుగురు జేడీయూ శాసనసభ్యులలో ఆరుగురు బీజేపీలో చేరారు. గత వారం ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో విలీనమయ్యారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసిన 38 నియోజకవర్గాల్లో ఆరు గెలుచుకుంది. బీజేపీలో చేరిన వారిలో ఖ జాయ్‌కిషన్, ఎన్ సనాతే, ఎండీ అచాబ్ ఉద్దీన్, మాజీ డీజీపీ ఎల్‌ఎం ఖౌటే, తంజామ్ అరుణ్‌కుమార్ ఉన్నారు.

కౌటే, అరుణ్ కుమార్ గతంలో బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని ప్రయత్నించిన ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో జేడీయూలో చేరి ఎన్నికల్లో గెలిచారు. నితీష్ కుమార్ ఇటీవలే బీజేపీని కాదని… ఆర్జేడీతో జట్టుకట్టి బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయ్.