ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం..
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వెళ్తున్న BMW కారు ముందుగా ఉన్న ఆటో ట్రాలీ ని ఢీ కొట్టింది . ప్రమాదంలో BMW కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అతి కష్టంతో అతనిని ప్రయాణికులు బయటకు తీశారు. స్వల్ప గాయాలతో కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.