Andhra PradeshBreaking NewsHome Page Slider

స‌త్య‌సాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

అదుపు త‌ప్పిన ఐష‌ర్ వాహ‌నం..గొర్రెల మంద మీద‌కు దూసుకెళ్ల‌డంతో గొర్రెల‌తో స‌హా గొర్రెల కాప‌రి మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న గురువారం జ‌రిగింది.తెలిసిన వివ‌రాల ప్ర‌కారం..శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం కోడేకండ్ల రామాపురం స‌మీపంలో రోడ్డు మీద‌గా గొర్రెల‌ను తోలుకుంటూ వెళ్తున్న వ్య‌క్తి మీద‌కు అక‌స్మాత్తుగా ఓ వాహ‌నం దూసుకొచ్చింది.దీంతో 25 గొర్రెలు చ‌నిపోయాయి.వాటిని తోలుకెళ్తున్న వ్య‌క్తి మీద నుంచి లారీ దూసుకుపోవ‌డంతో కాపరి అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. గ‌మ‌నించిన స్థానికులు వాహ‌నాన్ని ఆపారు.డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్నాడు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించి కేసు న‌మోదు చేసుకున్నారు.