Home Page SliderTelangana

ఓఆర్‌ఆర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శామిర్ పేట-కీసర మధ్య ప్రాంతంలో అవుటర్ రింగ్ రోడ్‌లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఘట్ కేసర్ నుండి మేడ్చల్ వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకొచ్చింది. అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని, మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలొరో వాహనంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలతో మృతిచెందాడు. మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.