మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉపాధిహామి కూలీలు మృతి చెందారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో మరొకరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. మల్లబోయినపల్లి దగ్గర కూలీలు ఉన్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ నుజ్జునుజ్జయ్యింది. అయితే కూలీలు రోడ్డు మధ్యన మొక్కలు నాటుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుల్లో దంపతులు శ్రీశైలం ,లలిత కాగా మరొకరు జడ్చర్ల మండలం ఆలూరుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.