పోలీసుల అత్యుత్సాహంతో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై తెల్లవారుజామున వెళ్తున్న లారీలు ఆపడానికి, వర్ధన్నపేట ఎస్ఐ చందర్ ఒక్కసారిగా పోలీస్ వాహనాన్ని అడ్డంగా నిలిపారు. దీంతో ఆ లారీలు సడెన్ బ్రేక్ వేయడంతో వరుసగా వస్తున్న 4 లారీలు ఒకదానికి ఒకటి ఢీకున్నాయి. ప్రమాదంలో లారీల ముందు భాగమంతా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలవడంతో పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రి తరలించారు.


 
							 
							