చైనాలో తీవ్రమైన జనాభా సమస్య.. స్కూల్స్ పరిస్థితి ఇదే..
చైనాలో గత కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గిపోతోంది. దీనితో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. గత సంవత్సరంలో జనాభా 20 లక్షల మంది తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కిండర్ గార్డెన్ స్కూల్స్ తగ్గిపోతున్నాయి. 2023లో దేశవ్యాప్తంగా 14,808 పాఠశాలలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా 2023లో కేవలం 90 లక్షల మంది మాత్రమే జన్మించారు. 1949 తర్వాత ఇంత తక్కువగా జనాభా నమోదు కావడం ఇదే మొదటిసారి. జననాల రేటు తగ్గడమే కాదు. వృద్ధ జనాభా పెరిగిపోవడం కూడా చైనాకు సమస్యగా మారింది. ఇప్పటికే 60 పైబడిన వారి సంఖ్య 30 కోట్లు ఉంది. మరో పదేళ్లకు 40 కోట్లు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. చదువుకునే పిల్లలు లేకపోవడంతో స్కూళ్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మార్చి, పాఠశాల సిబ్బందిని వారికి సంరక్షకులుగా నియమిస్తున్నారు.