Horoscope TodayNews

నేటి నుంచి మీ రాశిలో ఈ మార్పులు మొదలు..

మేషం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదావకాశాలు లభిస్తాయి.

వృషభం : వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. ఖర్చులకు సరిపడు ఆదాయం సమకూర్చుకుంటారు.

మిథునం : ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు శుభదాయకం. ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి.

కర్కాటకం : కొన్ని నచ్చని సంఘటనలెదురైనా భరించకతప్పదు. కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. దైవ దైర్శనాలు అనుకూలంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో చర్చలు జరుపుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు లభిస్తుంది.

సింహం : పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విదేశీ ప్రయాణాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులు క్వీజ్, పోటీలలో పాల్గొని విజయం సాధిస్తారు. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. రాజకీయనాయకులు వేడుకలలో పాల్గొంటారు.

కన్య : ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక విషయంలో మీకు విజయం లభిస్తుంది. బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. తప్పనిసరి చెల్లింపులు, ఆకస్మిక ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కుంటారు. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమంకాదు.

తుల : పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది.

వృశ్చికం : ఆర్థిక విషయాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. బంధువుల నుండి శుభ వార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు సహోద్యగులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం మీకు అనుకూలంగా మారతారు. మీ హోదా పెరుగుతుంది.

ధనుస్సు : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. ఆరోగ్యం మెరుగు పడుతుంది విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ, ఏకాగ్రత వహించండి. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది. నూతన ఆస్తి వస్తువుల కొనుగోలుకై ప్రయత్నాలు ఫలిస్తాయి

మకరం : విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. కొంతమంది మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ సన్నగిల్లుతుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

కుంభం : బంధు మిత్రుల వైఖరిలో మార్పును గమనిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. పండ్ల, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రైవేటు సంస్థలలో వారికి ఏకాగ్రత లోపంవల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవివాహితులు శుభ వార్తలు వింటారు.

మీనం : ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ప్రయోజనం పొందుతారు. కళాకారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఆధ్యాత్మిక, దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి.