Horoscope TodayNews

సెప్టెంబర్ 7 దినఫలాలు

మేషం : స్త్రీల పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు సమస్యలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం : ఫైనాన్సు, వ్యాపారులు మొండి బాకీల మీద దృష్టి ఉంచండి. మీతో సఖ్యత నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. అందరికి సహాయం చేసి మాటపడతారు. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిథునం : కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధననష్టము సంభవించును. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. కొత్త షేర్ల కొనుగోళ్లలో పునరాలోచన అవసరం. ఆరోగ్యములో ఆకస్మిక ఆందోళనతప్పదు.

కర్కాటకం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. కొన్ని నచ్చని సంఘటనలెదురైనా భరించక తప్పదు. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు ఊహించినవే కావటంతో మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సిద్ధం చేసుకుంటారు.

సింహం : ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. సభ, సన్మానాలలో చురుకుగా పాల్గొంటారు.

కన్య : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం నెరవేరగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశమైనా సద్వినియోగం చేసుకోవటం మంచిది.

తుల : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తులు, రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.

వృశ్చికం : ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. సభ, సన్మానాలలో చురుకుగా పాల్గొంటారు.

ధనుస్సు : మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వ్యాపారాల్లో అమలు చేసిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలిస్తాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిదికాదు.

మకరం : తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల, తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహోపకరణాలు అమర్చుకుంటారు.

కుంభం : కుటుంబీకుల మధ్య అవగాహన, ఏకాభిప్రాయం సానుకూలత లభిస్తాయి. సమయస్ఫూర్తితో ఒక సమస్యను అధిగమిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్తోమతుకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి.

మీనం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీతో సఖ్యత నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. స్తోమతుకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందులు తప్పవు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి.